హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఇక కేంద్రంపై యుద్ధమేనని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలియజేశారు. తెలంగాణ ఇస్తే సంబురం ఇవ్వకపోతే సమరమేనని ఎప్పుడో చెప్పినమన్నారు. నవంబర్ 6న కరీంనగర్‌లో పూర్తిస్థాయిలో మాట్లాడుకోని అన్ని విషయాలు తెలుపుతామన్నారు. ఢిల్లీలోతనతో కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపారని తెలంగాణ ఇస్తరనే అనుకుంటున్నట్లు ఆయన అశాభావం వ్యక్తం చేశారు. తన జీవిత ఆశయమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నారు. బదిలే ప్రసక్తే లేదన్నారు. మాట తప్పితే కత్తులు నూరి కేంద్రంపై యుద్ధం చేస్తామని తెలియజేశారు.




