Tuesday, 3 November 2026

తెలంగాణ ఇస్తారన్న విశ్వాసం కనబడుతోంది డీఎస్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయానికి నేతలందరూ కట్టుబడి ఉంటామని చెప్పడం హర్షణీయమని మాజీ పీసీసీ అధినేత డీఎస్‌ అన్నారు. మానసికంగా తెలుగు ప్రజలంతా సమైక్యంగానే ఉంటారనే భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తారన్న విశ్వాసం కనబడుతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలు సుఖశాంతులతో ఉండేలా అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *