ప్రమాదానికి గురైన మరో హెలికాప్టర్‌ సిబ్బంది సురక్షితం

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో మరో హెలికాప్టర్‌కు ప్రమాదం చోటుచేసుకుంది. హర్షిల్‌లో సహాయక చర్యలు నిర్వహిస్తున్న పవన్‌హన్స్‌కు చెందిన హెలికాప్టర్‌ కిందకు దిగుతూ భూమిని ఢీకొంది. అయితే సహాయక చర్యలు నిర్వహిస్తున్న సిబ్బంది ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు.