హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంపై సమైక్యవాదులు మరోసారి విషం చిమ్మారు.గతంలో ఎన్నోసార్లు తెలంగాణ వాదులు హెచ్చరించినప్పటికి తమ వంకరబుద్దిని మార్చుకోకుండా మరోసారి తెలంగాణపై అసత్య ఆరోపణలు చేసారు. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రబాకర్‌కు తెలంగాణ పై అసత్య ఆరోపణలు చేయడం కొత్త కాకపోయిన తాజాగా ఆయన తెలంగాణపై మరోసారి విషం చిమ్మారు. తెలంగాణ జర్నలిస్టుల ఆగ్రహానికి పరకాల గురికాక తప్పలేదు. ‘రుజువుల్లేని ఉద్యమం ‘ అనే పుస్త్తకాన్ని ఆవిష్కరించిన ఆయనకు జర్నలిస్టులు తగిన బుద్ది చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని అవమానించేలా మాట్లాడిన ఆయనకు తగిన బుద్ది చెప్పారు. ఆయన మాటలతో విసిగిపోయిన టీ జర్నలిస్టులు బషీర్‌బాగ్ ప్రెస్ క్షబ్‌లోనే ‘రుజువుల్లేని ఉద్యమం ‘ అనే పుస్తకాన్ని కాల్చివేశారు. ఆగ్రహాంతో పరకాల ప్రసంగిస్తున్న మైకును లాగివేశారు. మరోసారి ఈ విధంగా మాట్లాడితే తెలంగాణ వాదులనుంచి దేహశుద్ది తప్పదని హెచ్చరించారు.




