Tuesday, 3 November 2026

 తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్ విడుదల 

భైంసా రూరల్ మార్చ్ 04 జనం సాక్షి ఈ నెల 12న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్ను భైంసా ఉద్యమకారుల ఫోరం సభ్యులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ బోర్డు కోసం ప్రభుత్వం పదివేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఉద్యమకారులకు 20% కేటాయించాలన్నారు. నామినేటెడ్ పదవులలో ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులకు ఉచిత బస్సు పాసు సౌకర్యం కల్పించాలని అలాగే ట్రైన్ పాస్ ఆరోగ్యకారుడు 300 గజాల ఇంటి స్థలాన్ని వడ్డీ లేని రుణాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బైంసాలో తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి ఉద్యమకారులకు 10 లక్షల రూపాయలు, వారి ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో ఆట పాట నిర్వహిస్తూ తెలంగాణ నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లిన ప్రముఖ కవి రచయిత ఉద్యమకారుడు పుండలిక్ రావు పాటిల్, రిటైర్డ్ డి ఎఫ్ ఓ నాగనాథ్, ఉద్యమకారులు సురేష్ నిమ్మల, వై నాగనాథ్ తదితరులు పాల్గొన్నారు