Tuesday, 3 November 2026

వెంకటేశ్వర కళ్యాణంలో పాల్గొన్న హతిరామ్  నాయక్

 టేకులపల్లి, మార్చి 3( జనం సాక్షి ): గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శుక్రవారం టేకులపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామపంచాయతీ సంపత్ నగర్ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిన కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాంకుడోత్  హతిరామ్  నాయక్ పాల్గొని పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఎంతో మహిమగల దేవుడని, కొండపల్లి గోపాల్ రావు  వారసులు ప్రతి ఏటా ఘనంగా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం విషయమని మన టేకులపల్లి మండల పరిధిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకే ఒక దేవాలయం మన సంపత్ నగర్ లో ఉన్నదని, ఇందులో మన గిరిజన బిడ్డలు కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు చాలా సంతోషకరమని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. స్వామి వారి దయ  ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశ వారంపర్య ధర్మకర్తలు కొండపల్లి రాజగోపాల కిషన్,రజిత, అనువంశిక పారంపర్య ధర్మకర్తలు అజయ్ కుమార్ సునాలిని, పవన్ రావు, మంగతాయారు, స్థానికసర్పంచ్, జోగ సమ్మయ్య, ఆలయ కమిటీ సభ్యులు ఇస్లావత్ బాలు నాయక్, అక్కినపల్లి శ్రీనివాసరావు, జుంకీలాల్, దేవ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.