హైదరాబాద్: తెలంగాణ సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని భూపాలపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. యువత బలిదానాలకు పాల్పడవద్దని కోరారు. తెలంగాణపై నిర్ణయానికి మరికొంత సమయం కావాలన్నపుడు తమకు నిరాశ కలిగిందన్నారు. దీనిపై మంత్రులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని చెప్పారు.




