హైదరాబాద్: తెలంగాణ కోసం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. జైతెలంగాణ నినాదాలతో హడలెత్తిస్తున్నాడు. ఎల్బీనగర్ బైరామల్‌గూడలోని సెల్ టవర్ ఎక్కిన ప్రవీణ్ అనే యువకుడు వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. తెలంగాణ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని లేకుంటే టవర్‌పై నుంచి దూకుతానని హెచ్చరిస్తున్నాడు.




