హైదరాబాద్, ఫిబ్రవరి 20: తెలంగాణలోని గులాబీ జెండా తప్ప మరేజెండా కనిపింపచడం లేదని, గ్రేటర్ ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం ఉందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోమాజీగూడ మాజీ కార్పోరేటర్ మహేష్ యాదవ్ ఎంపీ కవిత, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆంధ్రా పాఠ్యపుస్తకాలలో తెలంగాణ చరిత్ర పెట్టనని చంద్రబాబు అంటున్నారని, తెలంగాణ ఉద్యమ చరిత్రను తొక్కిపెట్టాలని చూస్తే.. చంద్రబాబే చరిత్రలో లేకుండా పోతారని వ్యాఖ్యానించారు. హోం మంత్రి నాయిని మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నవారంతా ఇక్కడి వారేనని, తెలంగాణ బిల్లు పాసైన రోజే కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు టీఆర్‌ఎస్ వైపు వస్తున్నారని నాయిని పేర్కొన్నారు.




