తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ భారీర్యాలీ.

నెరడిగొండసెప్టెంబర్16(జనం సాక్షి:)
తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్రోత్సవ వేడుకలను నియోజకవర్గ వ్యాప్తంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జిల్లా ఉన్నతాధికారులు వివిధ శాఖ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు ప్రజలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు వివిధ మండల గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీని నిర్వహించి విజయవంతం చేశారు.నెరడిగొండ మండల ప్రజలు జడ్పీటీసీ అనిల్ జాధవ్ ఎంపీపీ రాథోడ్ సజన్ తోపాటు మండల పార్టీ సీనియర్ నాయకులు సర్పంచ్లు ప్రజలు అధిక సంఖ్యలో వజ్రోత్సవ ర్యాలీకి బయల్దేరారు.బోథ్ నియోజవర్గ కేంద్రంలో తెలంగాణ సమైక్యత ఉట్టిపడేలా తెలంగాణ ఉద్యమ పాటలు నృత్యాలు ఆకట్టుకున్నాయి.బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు తోపాటు వివిధ మండల జడ్పీటీసీలు ఎంపిపిలు సర్పంచ్లు. నాయకులుర్యాలీలో పాల్గొని జాతీయ జెండాను చేతపట్టి తెలంగాణ సమైక్యతను చాటారు.