హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ పార్టీ నేత కడియం శ్రీహరి తీరుపై ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు పరోక్ష విమర్శలు చేశారు. శ్రీహరిని దృష్టిలో పెట్టుకుని పార్టీ అంతర్గత విషయాలను కొందరూ మీడియాకు లీకు చేస్తున్నారని అన్నారు. పార్టీలో కొంతమంది చీడపురుగులున్నారని ,అలాంటి వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోయిన నష్టంలేదని ఆయన అన్నారు.




