Monday, 16 November 2026

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

నల్లగొండ: తిరుమలగిరిలో తెలంగాణ తల్లి విగ్రహన్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెలే కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి జగదీష్‌ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతు ఇంత రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన ఆరోపించారు. ఊసరవెల్లి ముదిరితే అది చంద్రబాబే అయితదని విమర్శించారు. బీసీ డిక్లరేషన్లని చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసంచరు అని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయం దండగన్న బాబు రైతు యాత్రలు చేయడం హాస్యాస్పందంగా ఉందని ఎద్దెవా చేశారు. జగన్‌ చేసిన తప్పులకు మంత్రులు జైలుకెళ్తుంటే విజయమ్మ ఎందుకు స్పందించరు అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీఆర్‌ఎస్‌ నేతలను, కార్యకర్తలను జైళ్లో పెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *