భువనగిరి టౌన్ (జనం సాక్షి):– ఈరోజు భువనగిరి జూనియర్ కళాశాల గ్రౌండ్ లో మన యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటుచేసిన ఫుడ్ ఫిష్ ఫెస్టివల్ కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామానికి మత్స్యశాఖ సొసైటీ రిజిస్ట్రేషన్ నియామక పత్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలసపతి, ఎమ్మెల్యే శైల శేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా తిమ్మాపురం సొసైటీ సభ్యులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జిన్నా కృష్ణ, అధ్యక్షుడు సుధాకర్, మరియు ప్రధాన కార్యదర్శి జిన్నా శ్రీశైలం, పాముల జాంగిర్, పాల సంఘం చిన్న నరసింహ మరియు ముదిరాజ్ సంఘం కమిటీ సభ్యులు ముదిరాజ్ కులస్తులందరూ పాల్గొనడం జరిగింది
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు




