తెలంగాణ పల్లె ప్రజల్లో వెల్లివిరిసిన చైతన్యం…

బెజ్జూరు రూరల్‌, ఆగస్టు 20 : నిత్యం పీకల దాకా తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్న తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా మారుమూల పల్లె ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసింది. రాష్ట్రంలో సారాను మళ్లీ ప్రవేశపెడతామని తెలంగాణ సర్కారు ప్రకటించిన నేపథ్యంలో తమ గ్రామంలో సారాను నిషేధిస్తూ ఆ పల్లె ప్రజలు ముక్తకంఠంతో తీర్మానించి రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచారు. ఆదిలాబాద్‌ జిల్లా మారుమూల మండలమైన బెజ్జూరులోని కృష్ణపల్లి గ్రామంలో పిల్లలు, పెద్దలు, మహిళలు అంతా సమావేశమై ఇక నుంచి తాము ఎవరూ నాటుసారా, సారా, మద్యం తాగమని తీర్మానించుకున్నారు