Thursday, 5 November 2026

తెలంగాణ పై కేంద్రానికి చిత్తశుద్ధి కరువు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ సమస్య పరిష్కారంపై కేంద్రానికి చిత్తశుద్థి లేదని తెలంగాణ రాజకీయ ఐకసా ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఈ నెల 16 ప్రధాని పర్యటనకు  నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసనలు తెలవనున్నట్లు కోదండరాం తెలియజేశారు. అలాగే ఇందిరా పార్కువద్ద నల్లరంగు గాలిబుడగలు ఎగురవేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణపై ఏకాభిప్రాయాన్ని కేంద్ర కోరటం రాజ్యాంగ విరుద్ధమన్నారు, నవంబరు 1 కి సంబంధించి కీలకమైన కార్యాచరణ రూపొందించుకున్న తర్వాతే స్టీరింగ్‌ కమిటీ భేటీ అవుతుందని ఆయన తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *