Wednesday, 4 November 2026

తెలంగాణ ప్రక్రియను వైకుంఠపాళిలాగా మార్చారు : నారాయణ

హైదరాబాద్‌:  తెలంగాణ ప్రక్రియను కాంగ్రెస్‌ వైకుంఠపాళిలాగా మార్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. తెలంగాణపై మరిన్ని  సంప్రదింపులు అవసరమంటూ ఆజాద్‌, షిండే చేసిన ప్రకటనలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణపై చర్చలంటూ సమస్యను మళ్లీ మొదటికి తెచ్చారని ఆరోపించారు. రాజకీయ పరిష్కారం ద్వారానే తెలంగాణ సాధ్యమని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *