తెలంగాణ ప్రస్తావన రాలేదు: దామోదర రాజనర్సింహ
ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చేసిన అధ్యయనం నివేదిక అంశాలను హోంమంత్రి షిండేకు తెలిపినట్లు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ అయిన రాజనర్సింహ తమ సమావేశంలో తెలంగాణ ప్రస్తావన రాలేదని స్పష్టంచేశారు.