Wednesday, 4 November 2026

తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో చంద్రబాబు చేసిన కృషి మరువలేనిది – నియోజకవర్గ కోఆర్డినేటర్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 20 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో చంద్రబాబు చేసిన కృషి మరువలేనిదని తెలుగుదేశం పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు. గురువారం చంద్రబాబునాయుడు జన్మదినం సందర్భంగా పట్టణంలోని టౌన్ హాల్లో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ మహ నగరాలకు దీటుగా సైబరాబాద్ మహానగరాన్ని నిర్మించి హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబునాయుడు ఎనలేని కృషి చేశాడన్నారు. హైటెక్ సిటీ నిర్మించి అనేకమంది నిరుద్యోగులను సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కరోనా విజృంభణ చేస్తున్న సమయంలో నాడు చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన జినోమ్ వ్యాలీ ద్వారా మందులు సరఫరా చేసిన విషయాన్ని తెలుగు ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. తెలుగు రాష్ట్రాలకు చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరం ఉందన్నారు. ఆయురారోగ్యాలతో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోష పతి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మీసాల సైదులు, గరిడేపల్లి మండల పార్టీ కన్వీనర్ కీసరి నాగయ్య, పాలకీడు మండల పార్టీ కన్వీనర్ పొదిల అమరయ్య , తెలుగు యువత పార్లమెంటు నాయకులు చల్లా వంశీ, చింతలపాలెం మండల పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ మేకల రామారావు యాదవ్ , వెంకట్ రెడ్డి, నరసింహారావు, నాగయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.