హుజూర్ నగర్ ఏప్రిల్ 20 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలో చనిపోయిన పలు మృతుల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురువారం పరామర్శించారు. హుజూర్ నగర్ పట్టణంలో చనిపోయిన కుక్కడపు అనిల్ కుమార్ తల్లి గారైన కుక్కడపు లలితమ్మ పార్థివ దేహాన్నికి, అనారోగ్యంతో చనిపోయిన మేళ్లచెరువు ప్రభుత్వ వైద్యశాల నందు మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న ఠాగూర్ ప్రేమ్ సింగ్ పార్థివ దేహాన్నికి, గత కొన్ని రోజుల క్రితం చనిపోయిన చింతకాయల వీరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఇందిరాల రామకృష్ణ, నార బోయిన నరసింహారావు, అమర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




