Tuesday, 3 November 2026

తెలంగాణ రాష్ట్రంలో ఎగురబోయే జెండా అది కాషాయ జెండాతెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో ఎగురబోయే జెండా అది కాషాయ జెండాతెలంగాణ రాష్ట్రంలో ఎగురబోయే జెండా అది కాషాయ జెండా
కొడకండ్ల,జనంసాక్షి నవంబర్30:భారతీయ జనతా పార్టీ కొడకండ్ల మండల శాఖ అధ్యక్షులు పులిగిల్ల ఉపేందర్ అధ్యక్షతన మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బ రాజశేఖర్ మాట్లాడుతూ బూతు స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని అసంపూర్తిగా ఉన్న బూత్ కమిటీలను తక్షణమే  నియమించాలని వారు కోరారు.2023లో తెలంగాణ రాష్ట్రంలో ఎగిరే బోయ జెండా అది కాషాయ జెండా అని పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా బూతు స్థాయిలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ఉద్యమాలు చేపట్టాలని మండలంలోని కార్యకర్తలను కోరారు భవిష్యత్తు రోజులు బిజెపి వని వారు ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుంకరనేని కోటేశ్వర్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రాయరపు కన్నయ్య, మండల ఉపాధ్యక్షులు రమేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు పనస రాములు, ఓబిసి మోర్చ మండల అధ్యక్షులు పసుపులేటి సాయి, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు గుగులోతు లక్ష్మణ్, పలు గ్రామాల బూత్ అధ్యక్షులు గణేష్, దామెర ఆంజనేయులు, కుమార్, రంజిత్, రమేష్, కప్పల నాగయ్య, బురుగు శీను, తదితరులు కార్యకర్తలు హాజరయ్యారు.