చట్టాలపై అవగాహన కల్గి ఉండాలి చట్టాలపై అవగాహన కల్గి ఉండాలి
డిప్యూటీ తహశీల్దార్ మధుసూదన్
జనం సాక్షి, చెన్నరావు పేట
మండలంలోని లింగాపురం గ్రామపంచాయతీ పరిధిలో గల ఎస్సీ కాలనీలో సర్పంచ్ తప్పేట రమేష్ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి డిటి మధుసూదన్ హాజరై , ఎస్ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించారు. ఎజెండా అంశాలు ఎస్సీ కాలనీలోని కరెంటు లూస్ వైర్ ను మార్చి కొత్త వైరు వేయాలనీ, ఎస్సీ కాలనీకి కొత్తగా ట్రాన్స్ఫర్ మంజూరు చేయాలనీ, కొత్త ఫోల్స్ మంజూరు చేయాలనీ, కాలనీకి కొత్తగా చేతి పంపు వేయాలనీ, మేఘ్య తండకు స్కూల్ బిల్డింగ్ మంజూరు చేయాలనీ, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలనీ, భూమి లేని నిరుపేదలకు మూడెకరాల భూమి పంపిణి, ఇల్లు లేని నిరుపేదలను డబుల్ బెడ్ రూములు నిర్మించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పసునూటి రమేష్,హెచ్ ఎం మోహన్ రావు,పంచాయతీ కార్యదర్శి శ్వేత, వార్డు సభ్యులు శ్రీను,ఎస్ సి కాలనీ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
చట్టాలపై అవగాహన కల్గి ఉండాలి చట్టాలపై అవగాహన కల్గి ఉండాలి




