తెలంగాణ రాష్ట్రంలో కాగితాలకే పరిమితమైన మహిళా సాధికారత
బిజెపి మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ యమునా పాఠక్
వనపర్తి టౌన్ : డిసెంబర్ 10 ( జనం సాక్షి ) భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కల్పన అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు జిల్లా ఇన్చార్జ్ యమునా పాఠక్ మాట్లాడుతూ, మహిళా సాధికారత అనేది మహిళలను చూసే దృష్టి కోణంలో మహిళల అభ్యున్నతికి అన్ని రకాల సహకారం ఉండేలా చూడటం అందులో విద్య,వైద్య పౌష్టికాహారం మహిళల రక్షణ ఆర్థిక స్వావలం మనకోసం తీసుకుంటున్న విధానం కలిపి వారి కాళ్ళ మీద వాళ్లు నిలబడి మేము ఎందులో తక్కువ కాద, అనే విశ్వాసం కల్పించడమని, అది ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం దేవుడెరుగు కానీ మహిళలపై జరుగుతున్న దాడులలో మాత్రం ముందంజలో ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని, విమర్శించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2013లో ప్రవేశపెట్టిన “భేటీ బచావో బేటీ పడవొ” ప్రాజెక్టు తీసుకురావడం జరిగిందని, అందులో భాగంగా మహిళల యొక్క నిష్పత్తి పెరిగిందని 2017 నుండి 19 వరకు వెయ్యి మంది, పురుషులకు 992 మంది స్త్రీలు ఉండేవారని,2019 నుండి 21 వరకు వెయ్యి మంది, పురుషులకు ఒక వెయ్యి 20 మంది స్త్రీలు ఉన్నారని,బేటి బచావో బేటి పడావో” కార్యక్రమం ద్వారా మహిళల నిష్పత్తి పెరిగిందని మహిళల అక్షరాస్యత శాతం కూడా ఐదు శాతం పెరిగిందని “సుకన్య సమృద్ధి యోజన” పథకం ద్వారా ఆడపిల్లల నిష్పత్తి పెరగడానికి చాలా దోహదపడుతుందని అమ్మాయి వివాహ వయసు 21 సంవత్సరాలు చేయడం వలన అమ్మాయిల చదువుకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా ఆరోగ్యాలు కూడా బాగుపడతాయని ఉద్దేశంతో ఈ పథకాలు ఏర్పాటు చేయడం జరిగిందని వీటన్నింటిని మహిళా మార్చ ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి అవసరం ఉందని తెలియజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని వీధి వీధికి బెల్టు షాపులో ఏర్పాటుతో రాష్ట్రం ఖజానాకు ఆదాయం నింపుకోవడానికి, ప్రయత్నిస్తుంది కానీ తాగిన మైకంలో తాగుబోతులు చేసే అత్యాచారాలు,హత్యలకు అమ్మాయిలు మహిళలు గురవుతున్నారని రాష్ట్రంలో పబ్లిక్ కల్చర్ పెరిగి మైనర్లు కూడా పబ్బులో మద్యం, సేవించి అత్యాచారాలు చేసిన ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో కోకోల్లోలని వారి మీద ఇప్పటివరకు ఏ చర్య తీసుకున్న పాపాన పోలే కేసీఆర్ సర్కారు, పోలీసు వ్యవస్థను శాంతి భద్రతలకు కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలపాలకు ఉపయోగించుకుంటే రాష్ట్రంలో డ్రగ్స్ అడ్డాగా మారనుందని, మహిళా సాధికారత మహిళల శక్తి మహిళల భద్ర పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న మహిళా రంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మహిళల యొక్క రక్షణకు కఠిన చట్టాలను తీసుకువచ్చి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేశారు.
కార్యవర్గ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజ వర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబిరెడ్డి వెంకటరెడ్డి బి కృష్ణ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి జ్యోతి రమణ బిజెపి జిల్లా కార్యదర్శి పద్మమ్మ,మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాధమ్మ,సుగురూ లక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.




