Wednesday, 4 November 2026

మానవ హక్కుల పరిరక్షనే లక్ష్యం

మానవ హక్కుల పరిరక్షనే లక్ష్యం

రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు

జగిత్యాల, డిసెంబర్ 10: మానవ హక్కుల పరిరక్షనే ప్రధాన లక్ష్యం కావాలని హక్కుల ఉల్లంఘన పై సమిష్టిగా పోరాడుదామని జాతీయ మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక సూర్య గ్లోబల్ స్కూల్లో మానవ హక్కుల దినోత్సవాన్ని జాతీయ అద్యక్షులు పలక సంపత్ కుమార్ ఆదేశాలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐల్నేని శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మానవ హక్కుల పై విద్యార్థులకు అవగాహన పెంచాలన్నారు. 1948 డిసెంబర్ 10 ఐక్యరాజసమితి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని ప్రకటించిందన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు, విభిన్న సంసృతి, భాషలు కలిగిన నేపథ్యంలో రెండు ఏండ్ల అద్యయనంతో ఈ ప్రకటన వచ్చిందన్నారు. జాతి, వర్ణ, కుల, మత వివక్షతల నుంచి రక్షించుకునేందుకు ఈచట్టం తోడ్పడుతుందన్నారు. క్రూరత్వం, వేట్టి చాకిరి, బానిసత్వం, మానవ అక్రమ రవాణా నుంచి రక్షించుకునేందుకు, మానవాళి స్వేచ్ఛగా జీవించేందుకు ఈ చట్టం పనిచేస్తుందన్నారు. భారతావనిలో 1993 లో అప్పటి ప్రభుత్వం మానవ హక్కుల పరిరక్షణ కోసం చట్టం చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ ను ఏర్పాటు చేసిందని తద్వారా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు అయ్యాయన్నారు. ఏ వ్యక్తికైనా, పనిచేస్తున్న ప్రాంతాలలో హక్కుల ఉల్లంఘన జరిగినట్లు అనిపిస్తే వెంటనే సామాజిక న్యాయం కోసం పోరాడాలని సహాయానికి ప్రతి జిల్లాలో ఒక ఎన్.హెచ్.ఆర్.సి. సభ్యుడు ఉన్నాడని అతని దృష్టికి సమస్యను తీసుకొనిరావాలని శ్రీనివాసరావు ప్రజలను కోరారు. బాధితుల పక్షాన సుమోటో గా కేసులు వేసి న్యాయం చేస్తామని శ్రీనివాసరావు అన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాస మహేష్, జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం, కన్వీనర్ కొక్కుల ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షలు కొండ్ర బీమేష్, కోశాధికారి సంతోష్, గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ బోయినిపల్లి శ్రీధర్ రావు, ప్రముఖ సామాజికవేత్త ఎర్ర నరేష్, శరత్, పృథ్వి, రాంప్రసాద్ లు పాల్గొన్నారు.