తెలంగాణ రాష్ట్ర గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఏ విటల్ గౌడ్.
కోటగిరి డిసెంబర్ 16 జనం సాక్షి:-తెలంగాణ రాష్ట్ర గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కోటగిరి గ్రామానికి చెందిన ఏ విటల్ గౌడ్ ను నియమించారు. ఈ మేరకు ఈనెల 9,10 తేదీలలో జరిగిన గీత పనివార సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ వీజి గౌడ్ సమక్షంలో ఆయన నియమకాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా శుక్రవారం రోజున కోటగిరి మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన ఏ విటల్ గౌడ్ నీ పూలమాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియమకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.రాబోయే రోజుల్లో గీత వృత్తి పరిరక్షణకై గౌడ కులస్తులతో ఐక్యంగా ఉద్యమిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీత పని వరల సంఘం మండల అధ్యక్షులు సురేష్ గౌడ్,ఉపాధ్యక్షులు వెంకా గౌడ్, కార్యదర్శి నరేష్ గౌడ్,పొతంగల్ టిసిఎస్ అధ్యక్షులు సాయ గౌడ్,ఎత్తోండ సాయిబాబా గౌడ్,శ్రీనివాస్ గౌడ్,గౌడ సంఘం నాయకులు,గీత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు




