భారత రాజకీయాల్లో నవ శకం బీఆర్ఎస్ ఆవిర్భావం
…… బీఆర్ఎస్ ఏర్పాటు చారిత్రక అవసరం
బీఆర్ఎస్ నాయకులు శాతరాజు యాదగిరి
మానకొండూరు, ఆర్ సి, డిసెంబర్ 16 (జనం సాక్షి)
భారతదేశ రాజకీయాల్లో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావం నవ శకానికి నాంది పలికిందని బీఆర్ఎస్ నాయకులు శాతరాజు యాదగిరి స్పష్టం చేశారు. పార్టీలో రైతులకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. అబ్ కీ బార్ …. కిసాన్ సర్కార్ ( ఈ దఫా రైతు ప్రభుత్వం) బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం, నినాదం అని చెప్పారు. పార్టీ ఏర్పడిన రోజే అనుబంధ రాష్ట్ర కిసాన్ సమితిని ఏర్పాటు చేసి అధ్యక్షునిగా గుర్నాం సింగ్ చ డూనీ నియమించినారని తెలిపారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల నుండి రైతు నేతలంతా తరలివచ్చి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతు తెలిపారన్నారు. దేశంలోని ప్రతి మూలన బీఆర్ఎస్ మార్కు కనపడేలా హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర జిల్లా జట్ఠాన్ గ్రామానికి చెందిన రైతు సంఘం నేత గుర్నాం సింగ్ అధ్యక్షునిగా, కార్యాలయ కార్యదర్శిగా రవి కొహోడ్ లను నియమించారన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ సంచలనాలకు, పరివర్తనకు భారత్ రాష్ట్ర సమితి కార్యాలయం వేదిక అవుతుందని, తెలంగాణలో అమలవుతున్న ప్రజా సంక్షేమ ప్రగతి విధానాలను బారాస వేదికగా దేశం మొత్తం పరిచయం అవుతాయని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఆవిర్భవించటం తో ఓర్వలేక అక్క సుతో భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారన్నారు. కరీంనగర్ లో గురువారం జరిగిన సభలో బీ ఆర్ఎస్ ను, సీఎం కేసీఆర్ కుటుంబం పై విమర్శలకే పరిమితం అవటం
ఇందుకు నిదర్శమన్నారు. కరీంనగర్ కు ఎంపీ తెచ్చిన నిధులు ఎన్ని …… సున్నా అని ఆయన ఎద్దేవా చేశారు. కరీంనగర్ ,వరంగల్ జాతీయ రహదారి ఆయనకు పట్టింపు లేదన్నారు. మాటల గారడి తప్ప కేంద్రం నుండి నిధుల మంజూరులో విఫలమయ్యారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. దేశ హితం కోసం కేసీఆర్ కొత్త ఉరవడి సృష్టించినారని బారాసతో దేశంలో గుణాత్మక మార్పు ఖాయమన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో భారాస అఖండ విజయం సాధించడం ఖాయం అని తేల్చి చెప్పారు.




