Wednesday, 4 November 2026

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎంపి లకు శిక్షణ సర్టిఫికెట్ ఇవ్వాలి

. జనం సాక్షి నర్సంపేట . తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలోని శాసన సభ్యులందరికీ ఆర్ఎంపీలకు శిక్షణ, సర్టిఫికెట్స్ ఇచ్చుట విషయం అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి ఆర్ఎంపీల పరిష్కరించడానికి కృషి చేయడానికి విజ్ఞాపన పత్రాలు సమర్పించడంలో భాగంగా
తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య రాష్ట్ర నాయకులు
డాక్టర్ ఎస్ ఎన్ హరిబాబు డివిజన్ అధ్యక్షులు టి స్వామినాథ్ ఆధ్వర్యంలో నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మెమొరండం ఇవ్వడం జరిగింది.
ఆ సందర్భంగా జరిగిన గ్రామీణ వైద్యుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న
పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ
8 సంవత్సరాల గా అసెంబ్లీలో ఎవ్వరు చర్చించని ఆర్ఎంపీల సమస్యల గురించి తాను ప్రస్తావించానని, ఇకముందు కూడా తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య అధ్యక్షులు
గజ్వేల్ జెడ్పిటిసి పంగ మల్లేష్ తో సమన్వయం చేసుకుంటూ ఆర్ఎంపీల కు శిక్షణ ఇచ్చేదాకా ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు హెల్త్ మినిస్టర్ తన్నీరు హరీష్ రావు సహకారంతో ఆర్ఎంపీల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
నర్సంపేట డివిజన్ ఆర్ఎంపీలకు హెల్త్ మెడికల్ సర్వీస్(. ఆర్.ఎం.పి సెంటర్ బిల్డింగ్ నిర్మాణం కొరకు 20 లక్షల రూపాయలు బడ్జెట్ తీసుకొచ్చానని టెండర్ ప్రకటించి మూడు నెలల్లో నిర్మాణ కార్యక్రమం పూర్తి చేయిస్తానని చెప్పారు.
అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఆర్ఎంపీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మరియు మండల నాయకులు వందమంది గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.