తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు వీణవంక మార్చి 31 (జనం సాక్షి) వీణవంక పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 13 వరకు జరిగే పదో తరగతి విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీ హెచ్ ఆర్ టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు అప్పని హరీష్ వర్మ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు హర్షం వ్యక్తం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు మరియు ఆర్థిక& వైద్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కృతజ్ఞతలు తెలుపుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్ష వేల ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల సరియాగు సమయానికి సురక్షిత ప్రయాణం చేసే అవకాశం ఉన్నందున మానసిక ఒత్తిడి తొలగి పరీక్షలు బాగా రాసే అవకాశం ఉందన్నారు కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని విద్యార్థులను తల్లిదండ్రులను కోరడం జరిగింది*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు




