Tuesday, 3 November 2026

తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక రివ్యూ సమావేశం నిర్వహించిన రాష్ట్ర అధ్యక్షుడు

ధర్మపురి( జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు బొల్లం మల్లేశం పిలుపుమేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలోని వివిధ గ్రామాల అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు ధర్మపురి పట్టణ కేంద్రంలో ఎస్ హెచ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుని పిలుపుమేరకు జిల్లా అధ్యక్షుడు సూరమల్ల సతీష్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ ఐడియాలజీని ప్రతి గ్రామ గ్రామాన తీసుకెళ్లడమే ఈ మాల ఐక్యవేదిక యొక్క ఉద్దేశం అని, ప్రతి గ్రామంలో అంబేద్కర్ స్టాచ్ అండ్ డ్రాపౌట్ స్టూడెంట్స్ ను గుర్తించాలి మాల సంఘ భవనాలు నిర్మించుకోవాలని, మన జాతి ఐక్యత కోసం మనం పాటుపడాలని ఆయన సూచించారు,రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం మాట్లాడుతూ మన ఆడపిల్లలను ఎలా రక్షించుకోవాలి వారిని ఉన్నతమైన స్థానంలో ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయాల మీద మహిళలకు ఆత్మగౌరవం మీద సమానత్వం మీద అవగాహన సదస్సులను ఏర్పాటు చేసుకోవాలని ఆయన చూచించారు. మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్ మాట్లాడుతూ గ్రామాలలో ఉండే నిరుపేద కుటుంబాలను గుర్తించి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తానని మాలకుల బాంధవులకు ఏ రాత్రి పగలుగాని ఆపతి సంపతీ వస్తే నేను వాళ్లకు చేదోడువాదోడుగా ఉంటానని చెప్పాడు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మండల ఎంపీపీ ఏడ్ల చిట్టిబాబు, కౌన్సిలర్ కార్తీక్, పలిగిరి లచ్చన్న, బోనాల రాజన్న, కళ్ళ లచ్చన్న,గుంపుల రమేష్, విద్యాసాగర్, గోడిశేలా రవికుమార్, మామిడి సత్యం,బుగ్గరం మండల అధ్యక్షుడు మంత్రి రమేష్, పెగడపల్లి మండల అధ్యక్షుడు భూపెల్లి రాజారత్నం, బండ్రా గంగాధర్, లక్కం నరేందర్, మరియు ఎంపీటీసీ లు సర్పంచ్ లు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.