Tuesday, 3 November 2026

ఖమ్మంలో జరిగే అనాధ పిల్లల అరిగోస దీక్షను జయప్రదం చేయండి

పెనుబల్లి, జూన్29(జనం సాక్షి) జులై నెల 1న ఖమ్మం లో ఎం ఎస్ పి ఆద్వర్యంలో జరిగే అనాధ పిల్లల అరిగోస దీక్ష ను విజయ వంతం చేయాలని ఎం ఎస్ పి జాతీయ నాయకులు కొలికిపోగు వెంకటేశ్వరరావు మాదిగ పిలుపుని చ్చారు,గురువారం పెనుబల్లి మండలంలో జరిగిన సమావేశంలో వేంకటేశ్వరావు మాట్లాడుతూ
అనాధ పిల్లల కోసం గురుకుల పాఠశాలలో గతంలో ముఖ్య మంత్రి కె సి ఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టు కోవాలని కోరారు, ముఖ్య అతిథులుగా మంద కృష్ణమాదిగ పాల్గొన బోయే ఈ దీక్షా కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల మండల, నియోజకవర్గ, జిల్లా రాష్ట్ర జాతీయ నాయకులు, పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు, అలాగే మీ మీ గ్రామం, మండల కేంద్రాల నుంచి అత్యధిక సంఖ్యలో అనాధ పిల్లలను తీసుకొచ్చి అనాధ పిల్లల అరిగో స దీక్షను జయప్రదం చేయాలని కోరారు, ఈ సమావేశంలో ఎంఎస్పీ నాయకులు జొన్నలగడ్డ వెంకటేశ్వరావు మాదిగ,కోట ప్రసాద్ మాదిగ, తేల్లూరి ఆంజనేయులు మాదిగ, సగ్గుర్తి బా లరాజు మాదిగ, గొల్లమందల కృష్ణ మాదిగ, మరకాల శీను మాదిగ, చావల పుల్లారావు మాదిగ, ఎం ఆర్ పి ఎస్ మండల నాయకులు సింగిశాల సామ్రాట్ మాదిగ, పాల్గొన్నారు,