Friday, 6 November 2026

తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రంలో తాండూరుకు ప్రత్యేక గుర్తింపు.

తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రంలో తాండూరుకు ప్రత్యేక గుర్తింపు.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీప నర్సింలు.
తాండూరు నవంబర్ 28(జనంసాక్షి)తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా పెద్దమొత్తంలో తాండూరు నియోజకవర్గనికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక నిధులు మంజూరు చెయ్యడం ఎంతో హర్షంచదగ్గ విషయమని,అభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నరని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు పేర్కొన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమె మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి పరుస్తూ తాండూరు పట్టణనికి పెద్దపీట వేశారని తెలిపారు. పట్టణంలో ని అన్ని వార్డులో అంగన్వాడీ ,మరియు డ్వాక్రా భావనలు,చిలుకవగు అభివృద్ధికి ప్రణాళికలు మరియు అదేవిధంగా 36 వార్డులకు 36కోట్ల రూపాయల నిధులు కేటాయించి వార్డులలో మౌలిక సదుపాయాలు కల్పించే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కంకణం కట్టుకున్నరన్నారని వేల్లడించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయ దేవి,సంగీత ఠాకూర్,మంకల్ రాఘవేందర్,అసిఫ్,ముక్తర్ నాజ్,అస్లాం, నాయకులు గుండప్ప ,రాజాక్, సంజీవ్ రావు,సంతోష్ గౌడ్,రాజన్ గౌడ్, జవీద్, ఈర్షద్, ఇంతియాజ్ బాబా,సలిమ్,చంటి యాదవ్ ,ఇబ్రాహీం తదితరులు పాల్గొన్నారు