Friday, 6 November 2026

పాఠశాలలో ‘పువ్వుల దినోత్సవం’

పాఠశాలలో ‘పువ్వుల దినోత్సవం’
వేములవాడ రూరల్, నవంబర్ 28 (జనం సాక్షి) : వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్స్ స్కూల్లో సోమవారం ఘనంగా పువ్వుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలను పువ్వులతో అలంకరించారు. చిన్నారుల అందమైన పువ్వుల వేషధారణ విశేషంగా ఆకర్షించింది. వీరికి కరస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కళ్యాణ్ కుమార్, అనిల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.