రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 14. (జనంసాక్షి) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలను తెలంగాణ వికాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ వికాస్ సమితి జిల్లా అధ్యక్షులు రామినేని పని రాజారావు, రాష్ట్ర నాయకులు భూంపల్లి రవీందర్, రాచర్ల వెంకన్న మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు భారత రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కల్పించిన ప్రదాత అని అన్నారు. డాక్టర్ అంబేద్కర్ అందించిన స్ఫూర్తిని అందరికీ తెలిసేలా రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షణ వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టినట్టుగానే కేంద్ర ప్రభుత్వం కూడా నూతనంగా నిర్వహిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వికాసమితి నాయకులు నడిమెట్ల శ్రీనివాస్, శేఖర్, డాక్టర్ శివరామకృష్ణ, వేముల లక్ష్మీరాజం, ఆంజనేయులు, జగదీశ్ చారి, మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




