Thursday, 5 November 2026

నల్లమల్లలో ఘనంగా అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు

 

 

 

 

 

అచ్చంపేట ఆర్ సి, 14 ఏప్రిల్ 2023 ,జనం సాక్షి న్యూస్:  రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను అచ్చంపేట పట్టణ మరియు నియోజకవర్గ పరిధిలోని   మండలాలు, గ్రామాలలో  ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక అచ్చంపేట పట్టణం కోర్టు తో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి 132 వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడలి లో  అంబేద్కర్ విగ్రహానికి  అచ్చంపేట గౌరవ న్యాయస్థానం జడ్జి  ఉపాధ్యాయ్  విజయ్ కుమార్, డిఎస్పీ కృష్ణ కిషోర్, సిఐ అనుదీప్, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ,ప్రజాసంఘాల నాయకులు  ,స్థానిక పోలీసు అధికారులు, బహుజన సంఘాల నేతలు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, అభిమానులు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మోపతయ్య ,బిఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి కొయ్యల శ్రీనివాసులు బిజెపి ఇన్చార్జి సతీష్ మాదిగ , అచ్చంపేట అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ,మేధావులు, విద్యావంతులు పాల్గొని అంబేద్కర్ గొప్పధనం, ఆశయాలపై  దేశానికి ఆయన అందించిన రాజ్యాంగం  ఫలాల కృషి పట్ల  ప్రసంగించారు. పలువురు కళాకారులు అంబేద్కర్ పాటలతో అలరించారు. కార్యక్రమంలో అంబేద్కర్ డివిజన్ అధ్యక్షులు పాత్కూల శ్రీశైలం ,ఆనంద్, సత్యానందం ,దాసయ్య తదితరులు పాల్గొన్నారు.