గద్వాల నడిగడ్డ, జూన్ (జనంసాక్షి);తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు స్మృతి వనం అందంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం రాజీవ్ మార్గంలోని స్మృతి వానాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి దశాబ్ది ఉత్సవాలకు అమరులకు నివాళులర్పించేందుకుగాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. త్రాగునీరు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే కలెక్టర్ కార్యాలయం వెనుక గల పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ సందర్శించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం శుక్రవారం రోజున జరిగే కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. స్టాల్స్,త్రాగునీరు, వైద్య సదుపాయం ఇతర ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ తో పాటు ఆర్ డి ఓ రాములు, డి పి ఆర్ ఓ చెన్నమ్మ, ఆర్ అండ్ బి ఈ ఈ ప్రగతి,మున్సిపల్ కమీషనర్ నర్సింలు, సి ఐ చంద్ర శేఖర్, తహసిల్దార్ వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




