Tuesday, 3 November 2026

బొమ్మనపల్లి లో నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు

టేకులపల్లి, జూన్ 1( జనం సాక్షి ): టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన రవికుమార్,రమ్య ల వివాహ వేడుకకు హాజరై నూతన వస్త్రాలు అందజేసి, వధూవరులను జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ ( చిన్ని), కోనేరు నాగేశ్వరరావులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు వివాహానికి హాజరైన వారిలో బుర్ర ధర్మయ్య గౌడ్, బుర్ర మోహన్ రావు, నల్లమాసు శంకర్, రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.