హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల వ్యవస్థపై మండలిలో ఈరోజు లఘు చర్చ జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి సమగ్రంగా వివరించారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా సభకు హాజరై సూచనలు, సలహాలు ఇస్తే బాగుండేదని మంత్రి అభిప్రాయపడ్డారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు సభకు రాలేదని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 4 ప్రాజెక్టులను వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామని… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి సాగునీరందించడమే తమ ప్రభుత్వం లక్ష్యమని హరీశ్‌రావు చెప్పారు. అనంతరం మండలి నిరవధికంగా వాయిదా పడింది.