ప్రెస్ అకాడవిూలో నేడు జర్నలిస్టులతో సిఎం సమావేశం
హైదరాబాద్,ఫిబ్రవరి20: విూడియాపై ఆంక్షలు నిరసిస్తూ తెలంగాణ సచివాలయంలో పాత్రికేయులు నిరసన చేపట్టారు. సీఎం కార్యాలయం ఎదుట పాత్రికేయులు, ఎలక్టాన్రిక్ విూడియా ప్రతినిధులు నిరసన తెలిపారు. తెలంగాణ సచివాలయంలో విూడియాకు ఆంక్షలు విధించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే దీనిపైఒక్కసారిగా జర్నలిస్టు సంఘాలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అలాంటి యోచన ఉంటే తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, దీనిపై పునరాలోచన చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్(టీడబ్ల్యూజేయూ) డిమాండ్ చేసింది. ప్రత్యేక రాష్టాన్ని సాధించుకున్న స్వల్పకాలంలోనే ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయడం దారుణమని యూనియన్ నేతలు వ్యాఖ్యానించారు. ఇది ముమ్మాటికీ జర్నలిస్టులకు ఆందోళన కలిగించే అంశమేనని వారు అభిప్రాయపడ్డారు. దీంతో స్వయంగా దీనిపై విూడియాకు వివరణ ఇవ్వాలని సిఎం నిర్ణయించారు. సచివాలయంలో విూడియాకు ఆంక్షలపై సందేహాలను సీఎం కేసీఆర్ నివృత్తి చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 2గంటలకు ప్రెస్ అకాడవిూలో జర్నలిస్టులతో సీఎం సమావేశం కానున్నారు. పాత్రికేయులకు సంబంధించిన అంశాలపై నేరుగా చర్చించనున్నారు. జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపై వారితో సీఎం నేరుగా చర్చించనున్నారు. కొందరు అధికారులు, మంత్రుల సూచనల మేరకు
తెలంగాణ సచివాలయంలో విూడియా ప్రతినిధుల ప్రవేశంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రింట్, ఎలక్టాన్రిక్
విూడియా ప్రతినిధులను అనుమతించరాదంటూ సూతప్రాయ నిర్ణయం తీసుకుంది. భద్రతపరమైన సమస్యలపై ఇంటెలిజెన్స్ నివేదిక;
ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కొందరు మంత్రులు, అధికారులు చేసిన ఫిర్యాదులను అనుసరించి అనుమతుల నిషేధానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు విూడియా సమావేశాలు నిర్వహించినప్పుడే విలేకరులను పిలుస్తారు. సమావేశాలు ముగిసిన వెంటనే వెనక్కి పంపించేస్తారు. విూడియా ప్రతినిధులు నిత్యం ఛాంబర్ల వద్ద ఉండడం వల్ల రోజువారీ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోందని సీఎంకు మంత్రులు, ముఖ్యకార్యదర్శులు ఫిర్యాదుచేశారు. సచివాలయానికి ఎవరు వచ్చినా వారు సీఎంను కలిసి చర్చించారనే తప్పుడు వార్తలు ఇస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఇటీవల ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో చాలా మంది అధికారులు విూడియా ప్రతినిధులతో పడుతున్న బాధలను వెల్లడించారు. విూడియాపై ఇంటెలిజెన్స్ అధికారులు సీఎంకు నివేదిక సమర్పించారు. విూడియా పేరిట చాలా మంది సచివాలయానికి వస్తున్నారని, వారిలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడం కష్టంగా ఉందని, వారు సీఎం కార్యాలయం, మంత్రుల ఛాంబర్ల వద్ద తిరుగుతున్నారని, దీని వల్ల భద్రతపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని
తెలిపారు. దాదాపు 20 న్యూస్ఛానళ్లు, పదిహేను దినపత్రికలు, ఇతర పక్షపత్రికలు, ఇంటర్నెట్ న్యూస్ వెబ్సైట్ల
విలేకరులు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాపర్లు అంతా 200 మందికి పైగా సచివాలయానికి వస్తున్నారని వివరించారు. ఈ
నేపథ్యంలో విలేకరులను సచివాలయంలోకి అనుమతించకుండా ప్రభుత్వ తరపునే వారికి సమాచారం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు విూడియాకు సరైన సమాచారం అందించేందుకు సాంకేతిక విజ్ఞానాన్ని
ఉపయోగించుకోవాలన్నారు.
.




