అనంతపురం,ఫిబ్రవరి20 ( జనంసాక్షి)
: అనంతపురం జిల్లా గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో శుక్రవారం స్కార్పియో-
ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానిక కురువ వీధికి చెందిన చిన్ననాగయ్య(50), ఎనిమిదో వార్డుకు చెందిన కదిరప్ప (55) ద్విచక్రవాహనంపై కొత్తపేట వెళ్తుండగా తాడిపత్రి నుంచి వస్తున్న స్కార్పియో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.




