Monday, 2 November 2026

తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం అభినందనీయం సీనియర్ పాత్రికేయులు కలువల శంకర్

రామకృష్ణా పూర్, (జనంసాక్షి) : ఇంటర్నేషనల్ దళిత నెట్ వర్క్  జర్నలిస్టు ,రాష్ట్ర బుద్ధవనం చైర్మన్ , మల్లెపల్లి లక్ష్మయ్య ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్  జర్నలిస్టులు  ఆదివారం  ఏరియా హాస్పిటల్  ప్రాంగణ బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహానికి  పూలమాల  వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  సీనియర్ పాత్రికేయులు కలవల శంకర్ మాట్లాడుతూ తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ పేరు నామకరణం చేయడం అభినందననీయమని, తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కి  ఇంటర్ నేషనల్ దళిత జర్నలిస్టుల నెటువర్క్ సబ్యులు కృతజ్ఞతలు తెలిపారు.అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం లోని ఆర్టికల్ 03 ప్రకారమే తెలంగాణ ఏర్పడిందని , ముఖ్యమంత్రి  కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి  అంబెడ్కర్ పేరు పెట్టి అభిమానాన్నిచాటుకున్నారనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు  సుభాష్ ,  నరేష్,సదానందం ,శ్రీనాధ్ తదితరులు పాల్గొన్నారు.