మల్లాపూర్ ఏప్రిల్30 (జనంసాక్షి)తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టి ఈరోజు ప్రారంభించిడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు దాసం కిషన్ అన్నారు. కిషన్ ఆధ్వర్యంలో మెట్ పల్లి పట్టణంలోని అంబేద్కర్ పార్కులో గల అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షుడు బలిజ సంతోష్ , ప్రధాన కార్యదర్శి పింజారి శివకుమార్, ఉపాధ్యక్షుడు బొల్లం రాజు, ఊడుగుల గంగాధర్,ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.




