Tuesday, 3 November 2026

‘తెలంగాణ సోనా’

సన్నరకం బియ్యం అధికోత్పత్తికి ఈఏడాది ప్రోత్సహించిన కొత్త వంగడం ‘తెలంగాణ సోనా’(ఆర్‌ఎన్‌ఆర్‌-15048) సాగు, దిగుబడి ఆశాజనకంగా ఉందని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం క్షేత్రస్థాయి అధ్యయనంలో వెల్లడైంది. గత జూన్‌ నుంచి ప్రారంభమైన వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌లో 3లక్షల 13th_agriculture_1583126gఎకరాలకు పైగా ఈపంట సాగుచేసిన రైతులకు పరిస్థితులు ఇప్పటివరకూ అనుకూలంగా ఉన్నాయి. సుదీర్ఘకాలంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాంబమసూరి, విజేత, కాటన్‌దొర సన్నాలు వంటి వరి వంగడాలనే సాగుచే
స్తున్నారు. వీటిస్థానంలో కొత్త వంగడాలను ప్రోత్సహించాలని ‘భారత వ్యవసాయ పరిశోధనమండలి’(ఐసీఏఆర్‌) సూచిస్తోంది. ఈనేపథ్యంలో జయశంకర్‌ వర్సిటీ పరిశోధనల్లో వెలుగులోకొచ్చిన తెలంగాణ సోనాను ప్రయోగాత్మకంగా ఈఏడాది రైతులతో సాగుచేయించారు. సాంబమసూరి పంటకాలం 150 రోజులు కాగా ఇది 120 రోజుల్లో చేతికొస్తుంది. వానాకాలం సీజన్‌లో తొలిసారి 3 లక్షల ఎకరాల్లో సాగు ఎకరానికి 35 నుంచి 40 బస్తాల దిగుబడి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *