హైదరాబాద్: హజ్ యాత్ర దుర్ఘటన తర్వాత గల్లంతైన 21 మంది తెలంగాణకు చెందిన యాత్రికుల ఆచూకీ లభించిందని స్టేట్ హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్ఏ షుకూర్ సోమవారం ప్రకటించారు. వారంతా క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు. 21 మందిలో 13 మంది హైదరాబాద్ వాసులు కాగా, మిగతా ఎనిమిది మంది రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందినవారు ఉన్నారని తెలిపారు. హజ్ హౌస్‌లో ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ మరో రెండు రోజులు పనిచేస్తుందని పేర్కొన్నారు




