Tuesday, 3 November 2026

లంకభూములను రిజిస్ర్టేషన్‌ చేయించండి.

విజయవాడ: రాజధాని పరిధిలోని ఉద్దండ్రాయుని పాలెం లంక భూములకు రిజిస్ర్టేషన్‌ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్యాంపు కార్యాలయంలో సోమవారం రైతులు వినతిపత్రాన్ని సమర్పించారు. రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌ భూములకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని హామీ ఇచ్చారని, దాంతో తాము ల్యాండ్‌ పూలింగ్‌కు అనుకూలంగా భూములు ఇవ్వడానికి అంగీకరించామని తెలిపారు. ఈ భూములపై బ్యాంకులో రుణాలు కూడా తీసుకున్నామని, కానీ రుణమాఫీలో తమ పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండు కోట్ట రూపాయలతో బ్యాంకు రుణాలు మాఫీ చేయాల్సి ఉందన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి భూములను ల్యాండ్‌ పూలింగ్‌కు తీసుకుని తగిన ప్యాకేజి ఇప్పించాలని ముఖ్యమంత్రికి విన్నవించినట్లు రైతులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *