హైదరాబాద్ : విద్యుత్ సమస్యల పరిష్కారానికి కాకినాడలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన దీక్షకు సంఘీభావంగా తెలుగు మహిళా విభగం నేతలు ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో రిలే దీక్షలు చేపట్టారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందిని తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమవతి మండి పడ్డారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించుకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.




