Monday, 2 November 2026

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

హైదరాబాద్‌: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 24గంటల్లో.. వాయువ్య బంగాళాఖాతంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల రెండు, మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓమోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఎల్లుండి నుంచి తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రెండ్రోజులపాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *