Wednesday, 4 November 2026

తెలుగు రాష్ర్టాలపై అల్పపీడన ద్రోణీ ప్రభావం.. హైదరాబాద్‌లో పలుచోట్లవర్షాలు, జలమయమైన రోడ్లు హైదరాబాద్‌, ఆగస్టు 16 : అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతుండంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు కోస్తా, సీమాంధ్రలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు సాగుకు మంచి అవకాశమని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు వర్షంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి వద్ద చీకుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం దాటికి గ్రామాలు జలమయమ్యాయి. దాదాపు 25 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో గోదావరి నది నీటిమట్టం 35 అడుగులకు చేరుకుంది. రాజమండ్రి పట్టణంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైటెక్ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షం ప్రజలను ఆశ్చర్యచకితులను చేయగా మరికొందరు చేపలను పట్టుకునేందుకు పరుగులు తీశారు. జిల్లాలోని నగరం మండలం ఉయ్యాలవారి పాలెంలో జరిగిందీ సంఘటన. గతరాత్రి కురిసిన భారీ వర్షంతో పొలాల్లో చేపలు పడ్డాయని ఆనోటా ఈనోటా పాకడంతో గ్రామస్తులు పొలాలకు చేరుకుని చేపల వేటలో నిమగ్నమయ్యారు.

హైదరాబాద్‌, ఆగస్టు 16 : అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతుండంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు కోస్తా, సీమాంధ్రలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు సాగుకు మంచి అవకాశమని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదయాన్నే కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు వర్షంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి వద్ద చీకుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం దాటికి గ్రామాలు జలమయమ్యాయి. దాదాపు 25 గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలో గోదావరి నది నీటిమట్టం 35 అడుగులకు చేరుకుంది.
రాజమండ్రి పట్టణంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైటెక్ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.
గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షం ప్రజలను ఆశ్చర్యచకితులను చేయగా మరికొందరు చేపలను పట్టుకునేందుకు పరుగులు తీశారు. జిల్లాలోని నగరం మండలం ఉయ్యాలవారి పాలెంలో జరిగిందీ సంఘటన. గతరాత్రి కురిసిన భారీ వర్షంతో పొలాల్లో చేపలు పడ్డాయని ఆనోటా ఈనోటా పాకడంతో గ్రామస్తులు పొలాలకు చేరుకుని చేపల వేటలో నిమగ్నమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *