Wednesday, 4 November 2026

యథేచ్ఛగా మద్యం, మాంసం విక్రయాలు

మంగళగిరి టౌన్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ పట్టణంలో వాటి విక్రయాలు జోరుగా సాగాయి. మాంసంతోపాటు చేపలు, రొయ్యల విక్రయాలు బహిరంగంగానే సాగించినప్పటికీ… మునిసిపల్‌ అధికారులు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఇక మద్యం విషయానికొస్తే శుక్రవారం షాపులు సీజ్‌ చేయడానికి ముందే కొంత మంది వ్యాపారులు పెద్ద ఎత్తున స్టాకును బ్లాకులోకి తరలించారు. ఎమ్మార్పీ ధరపై రూ.పది నుంచి రూ.20 మేర అదనపు ధరలకు అమ్మి మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *