Thursday, 5 November 2026

తెలుగు వెలుగు జాతీయ సంస్కృతీ సాహితి సాంస్కృతిక సంబరాలు-2022

జనం సాక్షి, చెన్న రావు పేట

తెలుగు వెలుగు సాహితీ వేదిక సంస్థ దశమ వార్షికోత్సవం సందర్భంగా,  భాగంగా వివిధ రంగాలలో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి, వారిని తెలుగు వెలుగు జాతీయ పురస్కారంతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా చెన్నారావుపేట, అక్కల్చెడ గ్రామానికి చెందిన పాలడుగుల రవి గత 5 సంవత్సరాలనుండి 108 బైక్ అంబులెన్సు లో ఏమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గా కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతం లో విధులు నిర్వహిస్తున్నారు. ఆపద సమయంలో ఎవ్వరైనా 108 కి కాల్ చేస్తే మొదటగా ఫస్ట్ రెస్పాండర్ రవి స్పంధించి సంఘటన స్థలానికి వెళ్లి అత్యవసర చికిత్స అందించి, అంబులెన్సు రాగానే క్షతగాత్రులని అంబులెన్సు లో తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఇతను 1500 లకు పైగా గత ఐదు సంవత్సరాల నుండి అన్ని రకాల క్షతగాత్రులకి చికిత్స అందించారు.ఇతని సేవలను గుర్తించి తెలుగు వెలుగు స్వచ్ఛంద సంస్థ వారు తెలుగు వెలుగు జాతీయ విశిష్ట వైద్య సేవా జ్యోతి గౌరవ పురస్కారం ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,తెలంగాన శాసన మండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య, వరంగల్ గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి చేతుల మీదుగా అందుకున్నారు. ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పాలోజు రాజు కుమార్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతో మందికి వైద్య సేవలు అందించినందుకు గాను రవి కి ఈ పురస్కారం లభించిందన్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతు నా సేవలను తెలుగువెలుగు సాహితి వేదిక వారు గుర్తించి ఈ అవార్డు ప్రధానం చేయడం చాలా ఆనందం గా ఉందనీ,నేను ఈ పురస్కారం అందుకోవడానికి ముఖ్య కారకులు మా ప్రాజెక్ట్ మేనేజర్, ఈఎంఈ హరీష్ నాకు వెన్నెంటే ఉండి, ఒక్క సోదరుడిలా మంచి, చెడులను వివరిస్తూ, ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించడానికి ప్రోత్సహించారు. హరీష్ సార్ కి ఎల్లప్పుడూ కృతజ్ఞతుడనై ఉంటాను. ఈ కార్యక్రమం లో తెలుగు వెలుగు ప్రముఖులు, ఉత్తమ అవార్డు గ్రహీత లు తదితరులు పాల్గొన్నారు.