Thursday, 5 November 2026

నూతన వధూవరులను ఆశీర్వదించిన సండ్ర దంపతులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన సండ్ర దంపతులు

పెనుబల్లి, డిసెంబర్ 5(జనం సాక్షి)
సర్పంచ్ ఇంట  నిశ్చయ తాంబూలాలకు సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు.  కొత్త కారాయి గూడెం గ్రామ సర్పంచ్ దొడ్డపనేని శ్రీదేవి రవి  కుమార్తె  నిశ్చయ తాంబూలాలకు
తిరువూరు లోని శ్రీరస్తు  కళ్యాణ మండపానికి కుటుంబ సమేతంగా  ఎమ్మెల్యే హాజరై కాబోయే నూతన జంటను ఆశీర్వదించారు. కార్యక్రమంలో సత్తుపల్లి రూరల్ సీఐ  హనోక్, ఎంపీడీవో మహాలక్ష్మి,  జడ్పిటిసి  చెక్కిలాల మోహన్ రావు,   లక్కినేని వినీల్, మాజీ ఎంపీపీ చీకటి బేబీ శకుంతల రామారావు, టిఆర్ఎస్ నాయకులు కనగాల వెంకట్రావు, చెక్కిలాల లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు