Tuesday, 3 November 2026

తెలుగు సాహిత్యంలో మేటి, ‘పోలీసు’ కవి

ముప్కాల్ జనం సాక్షి ( ఫిబ్రవరి 27 ) మండల పోలీస్ స్టేషన్లో ఇంచార్జ్ ఎస్సైగాపని చేస్తున్న తొగర్ల సురేష్ ఏఎస్ఐ శాంతి భద్రతల నిర్వహణతో పాటు సాహితీ రంగంలో దిగ్విజయవంతంగా కొనసాగుతున్నారు వృత్తిరీత్యా పోలీసు ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ప్రవృత్తి రీత్యా అనేక కవితా సంపుటులు రచనలను చేస్తూ సామాజిక రుగ్మతలపై అనేక అంశాలపై కవితలను రచిస్తూ రచనలను చేస్తూ ప్రజలను ఉత్తేజ పరుస్తున్నారు నిన్న ఆదివారం నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తమ యొక్క గురువులను పూజిస్తూ తాను రచించిన “ఈ అమ్మాయే మన కోడలు”అనే పుస్తకాన్ని తమకు విద్యాబుద్ధులు అందించిన ప్రధానోపాధ్యాయుల చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తోటి మిత్రులు ఉపాధ్యాయులు సురేష్ను అభినందించి గొప్పగా కొనియాడారు సాహితీ రంగంలో అత్యున్నత స్థానాన్ని అందుకోవాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సన్మానించారు